![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-505 లో.. నర్మదకి ఒక పార్శిల్ వస్తుంది. అది తీసుకోవడానికి శ్రీవల్లి వెళ్తుంది. అతను కోడ్ చెప్పమని చెప్తాడు. శ్రీవల్లికి తెలియకపోవడంతో ఏదో ఏదో చెప్తుంటుంది. కాసేపటికి నర్మద వచ్చి తన మొబైల్ కి వచ్చిన కోడ్ చెప్పి పార్శిల్ తీసుకుంటుంది.
ఆ తర్వాత దానిని ప్రేమ, ధీరజ్ చూస్తారు. ఇక నర్మద, వేదవతి, శ్రీవల్లి, సుకన్య, అందరు అక్కడే ఉంటారు. ఇదేంటని ధీరజ్, ప్రేమ అడుగగా నిజం చెప్పించే మిషన్ అని చెప్తుంది నర్మద. అది విని వల్లికి చెప్తుంది సుకన్య. ఇక వల్లి మౌనవ్రతం డ్రామా మొదలుపెడుతుంది. ఉదయం తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మౌనవ్రతం అని వల్లి అంటుంది. నిజం చెప్పాల్సి వస్తందని ఇలా ప్లాన్ చేశావా అని నర్మద అనుకుంటుంది. ఆ తర్వాత మిషన్ ని చూసి అదేంటని వేదవతి అడుగగా ముందు మీరు కూర్చోండి . మీరు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో తెలుస్తుందని నర్మద అంటుంది. వేదవతికి కనెక్షన్స్ అన్నీ పెట్టి.. ఒక్కో కోడలి గురించి చెప్పమని అంటుంది నర్మద. మొదటగా వల్లిని తిడుతూ ఉంటే నర్మద, ప్రేమ ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత తన గురించి చెప్పమని అడుగుతుంది నర్మద. నా గవర్నమెంట్ కోడలు మంచిది, చాలా మంచిది అని వేదవతి అనగానే తప్పు అని మిషన్ అరుస్తుంది. ఇక నిజం చెప్పమని నర్మద అనగానే గడుసు కోడలు.. నా మీదే పెత్తనం చెలాయిస్తుందని వేదవతి అనగానే మిషన్ కరెక్ట్ అని అరుస్తుంది. ఇక చివరి కొశ్చన్ అడుగుతుంది నర్మద. మా ముగ్గురు కోడళ్ళలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమని నర్మద అడుగుతుంది. మేనకోడలు ప్రేమ అంటే ఇష్టమని వేదవతి అని అంటుంది. అంటే ఏంటి మేం బయట నుండి వచ్చామని ఇష్టం లేదా అని వల్లి రెచ్చిపోతుంది.
సుకన్య ఎంత చెప్పినా వినకుండా వల్లి వాగుతూనే ఉంటుంది. ఏంటి వదిన మౌనవ్రతం అన్నారని ధీరజ్ అంటాడు. నీ మౌనవ్రతం భంగం అయిపోయిందని ప్రేమ అంటుంది. ఇక వల్లిని కూర్చోబెడతారు. నిజం చెప్పమని నర్మద అంటుంది. అబద్ధం చెప్తే దొరికిపోతావని నర్మద అంటుంది. నువ్వు హాస్పిటల్ కి ఎన్నిసార్లు వెళ్ళావని నర్మద అడుగుతుంది. మొదటిసారి మూడు అని వల్లి అంటుంది. కానీ మిషన్ తప్పు అని అరుస్తుంది. తర్వాత ఒక్కసారి అని చేయి చూపిస్తుంది వల్లి. కానీ తప్పు అని మిషన్ అరుస్తుంది. దాంతో ఒక్కసారి కూడా వల్లి చెకప్ కి వెళ్ళలేదనే నిజం అందరికి తెలుస్తుంది. మరి ఆ ట్యాబ్లెట్స్ అని వేదవతి అడుగగా సుక్కు తెచ్చిందని చెప్తుంది వల్లి. అవునని సుకన్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |